V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు…..

SHARE:

– అధికార పార్టీకి ఎదురుదెబ్బ

– మాజీ ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది చేరిక

– కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నచ్చకపోవడం వల్ల వలసలు

– మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నయవంచన చేసింది

– ప్రజలలో తిరుగుబాటు మొదలైంది.. ఓటుతో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుతారు

– మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురు దెబ్బ తగిలింది ..నాగిరెడ్డిపేట్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల కిష్టయ్య ఆధ్వర్యంలో వాడి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ లకు చెందిన నాయకులు ఆదివారం రోజు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నయవంచన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నచ్చక మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో తిరుగుబాటు మొదలైందని.. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india