V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వం ఆధ్వర్యం లో ముందస్తుగా క్రిస్మస్ పండగ సంబరాలు……

SHARE:

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల మీనా గార్డెన్ లో క్రిస్మస్ పండగను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అధికారికంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి క్రిస్మస్ సంబరాలలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్ మయి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరూ భక్తిశ్రద్ధలతో ఏసు ప్రభువును ప్రార్థిస్తూ CSI చర్చి నుండి మీనా గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్రిస్మస్ సంబరాల లో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ మతానికి చెందిన సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలో క్రైస్తవ మత పెద్దలు ఆయనను ఘనంగా ఎవరు శాలువాతో సత్కరించారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, రఘు, ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, ఏఎంసి వైస్ చైర్మన్ యామ రాములు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, క్రైస్తవ మత పెద్దలు, సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india