V1News Telangana

best news portal development company in india

నీటి కష్టాలు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల శివాజీ నగర్ కాలనీలో ప్రజలు నీటి కొరత వల్ల కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత ఐదు, ఆరు రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదని తెలిపారు. కాలనీలో అందుబాటులో ఉన్న మోటారు కాస్త పాడైపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాట్ల సీజన్ అవడం వల్ల పనులకు వెళ్లే వారు నీళ్ల సరఫరా లేకపోవడం వల్ల.. అదేవిధంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం స్నానాలకు నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా ప్రజలు నీటిని పట్టుకొని వినియోగించుకుంటున్న దృశ్యం శుక్రవారం రోజు వెలుగులోకి వచ్చింది. మిషన్ భగీరథ నీరు స్వల్ప మోతాదులో సరఫరా అయినప్పటికీ ఆ నీళ్లు కాస్త మురికిగా వినియోగించుకోవడానికి వీలుకాకుండా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నీటి సరఫరా కలిగించి కాలనీవాసులకు నీటి కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india