పాఠశాల వెనుక జోరుగా బెల్ట్ షాపులు

జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వెనుక ఓ వ్యక్తి జోరుగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ విచ్చలవిడిగా మద్యం భారీరేట్లకు విక్రయిస్తూ, కుల్ల మద్యం విక్రయించడం జరుగుతుందని అనేక ఏళ్ల నుంచి పాఠశాల వెనుక మద్యం వికయాలు చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మామూలు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు, ప్రధాన రహదారి పక్కనే బెల్ట్ షాపులు జోరుగా నిర్వహిస్తున్నారని , కొన్ని దేవాలయాల పక్కన కూడా బెల్ట్ షాపులు మండల కేంద్రంలో జోరుగా నిర్వహిస్తున్నారని. ప్రధాన కూడలి వద్ద బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం విడ్డూరమని ప్రజలు మండిపడుతున్నారు.
అంబం ఆర్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే బెల్ట్ షాపు నిర్వహణ
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం ఆర్ గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే ఓ వ్యక్తి జోరుగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ బెల్టు షాపు నిర్వాణ కోసం సుమారు 1,50,000 వరకు పాట పాడి వేలంపాటలో హస్తగతం చేసుకొని బెల్ట్ షాపు జోరుగా అధిక ధర లకు విక్రయిస్తున్నారని విమర్శలు లేకపోలేదు, అక్బర్ నగర్ గ్రామంలో సైతం సుమారు అయిదు వరకు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ అధికారులు భారీగా మామూలు తీసుకుంటూ, వీరిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు, చర్యలు తీసుకుంటున్నాము అనే పేరుతో వారి వద్ద మామూలు భారీగా తీసుకుంటూ యధావిధిగా పరోక్షంగా నడపడంలో ఎక్సైజ్ శాఖ తో పాటు ఇతర శాఖ అధికారులు పాత్రధారులు సూత్రధారులు అవుతున్నారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా వారి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి నెల నెల జీతం డబ్బులు ప్రజలు ఇచ్చే పనుల ద్వారా తీసుకోవడమే కాకుండా ప్రజలకు ఆటంకంగా మారిన బెల్ట్ షాపులు తొలగించడంలో ఈ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సులేమాన్ ఫారం గ్రామంలో సైతం బెల్ట్ షాపు జోరుగా నిర్వహిస్తున్నారని, కోటగిరి మండల కేంద్రంలో పదులు వందల సంఖ్యలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చుట్టుపక్క గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని పొత్తంగల్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్క గ్రామాల్లో బెల్ట్ షాపులు జోరుగా నిర్వహిస్తున్నారని వారిని మండల కేంద్రంతో పాటు బస్టాండ్ ప్రాంగణంలో అదేవిధంగా చుట్టుపక్క గ్రామాల్లో బెల్ట్ షాపులు జోరుగా నిర్వహిస్తున్నారని, ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి మండలాల్లో బెల్ట్ షాపులు లేని గ్రామాలు లేవని నీరులేని గ్రామాలు ఉండొచ్చు కానీ బెల్టు షాపు లేని గ్రామాలు లేవని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో బెల్ట్ షాపులు జోరుగా నిర్వహిస్తున్నప్పటికీ సమ్మతి శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా వారి వద్ద భారీగా మామూలు వసూలు చేస్తున్నట్టు ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఒక్క బోధన్ మండలం పెంట గ్రామంలోనే సుమారు 19 వరకు బెల్ట్ షాపు నిర్వహిస్తుండగా ఓ బెల్ట్ షాప్ మాత్రం రామాలయం పక్కనే జోరుగా నిర్వహిస్తున్నప్పటికీ ఆయన నుంచి భారీగా మామూలు వసూలు చేస్తున్న అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు, వైన్స్ నిర్హక్కులే ప్రత్యక్షంగా పరోక్షంగా బెల్ట్ షాపు నిర్వహించడంలో హస్తగతులు అవుతున్నారని ప్రధాన పాత్రధారులు అవుతున్నారని విమర్శలు లేకపోలేదు. ఎన్ని వార్తలు వచ్చినా ఎన్ని ఫోన్లు సంబంధిత శాఖ అధికారులకు చేసిన అధికారులు మాత్రం నీ మ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు తప్ప వారిపై చర్యలు తీసుకోవడం విఫలమవుతారని మామూలుగా ఏదో కంటి తలుపుగా కేసులు చేశామని చేతులు దులుపుకుంటారు తప్ప శాశ్వతంగా బెల్ట్ షాపులు తొలగించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతారని ప్రజలు వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం, విమర్శలు వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








