V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోచి గణేష్ ఆధ్వర్యంలో, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఈ సందర్భంగా మోచి గణేష్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం లోని లగచర్ల రైతులపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, జైల్లలో నిర్బంధించి, అన్నం పెట్టే రైతన్నలపై దాడులు నిర్వహించింది కాక వారి చేతులకు బేడీలు వేసి వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ, అమానవీయ, అణచివేత విధానాలకు నిరసనగా.. రైతులపై అక్రమంగా నమోదు చేసిన పోలీస్ కేసులను వెంటనే ఎత్తివేసి వారిని విడుదల చేయాలని కోరారు.

రైతన్నల కుటుంబాలను వేధిస్తూ, హింసించడం ఆపివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం” బాగు పడినట్లు చరిత్రలో లేదని ఇప్పటికైనా ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, శివ సూరి, చాకలి సాయిలు, గౌస్, చాకలి మహేష్, జీవన్, అనిల్, నల్లోల్ల సాయిలు, లక్ష్మణ్, మొగులయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








