V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన బిజెపి బూత్ అధ్యక్షులు గంపల సాయికుమార్ కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగిపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని బిజెపి నాయకులు ( NRI) కోనేరు శశాంక్ దృష్టికి తీసుకువెళ్లగా మానవతా దృక్పథంతో ఆయన వెంటనే స్పందించి నస్రుల్లాబాద్ మండల శాఖ, అధ్యక్షుడు సున్నం సాయిలు చేతుల మీదుగా మంగళవారం రోజు బాధితుడికి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయం అందించినందుకు బాధిత కుటుంబ సభ్యులు కోనేరు శశాంక్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, మండల కార్యదర్శి మేకల రాములు, ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాసరావ్, కంది పెద్ద మల్లేష్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








