V1News Telangana

best news portal development company in india

ఎలక్ట్రిక్ వస్తువుల చోరీపై కేసు నమోదు….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ట్రాన్స్ కో ఎలక్ట్రిక్ పనుల గుత్తేదారు ఎండి ఫారూఖ్ అహ్మద్ తన ఎలక్ట్రానిక్స్ గోదాంలో నిల్వ ఉంచిన ఎలక్ట్రిక్ వస్తువులు చోరీకి గురైనట్లు సోమవారం రోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా దొంగలు వ్యవసాయ బోరు బావుల వద్ద నుండి కేబుల్ వైర్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు అదేవిధంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్నారని.. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india