V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఇటీవల బిజెపి పార్టీలో చేరిన ఎన్నారై కోనేరు శశాంక్ ను పార్టీ శ్రేణులు బాన్సువాడ మండలం కొయ్యగుట్ట నుండి తన స్వగ్రామం ఎత్తొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల మరియు శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించాలని దృక్పథంతో బిజెపి పార్టీలో చేరానని అన్నారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల శ్రీ రామ మందిరానికి అభివృద్ధి కొరకు NRI కోనేరు శశాంక్ 15000 రూపాయల చెక్కుని బీజేపీ నసురుల్లాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ అరిగె నారాయణకు అందించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేకల రాములు, ఓబిసి జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, పి .గంగాధర్, ఉల్లెంగ గోపి, జగ్బీర్ సింగ్, గొడిసెల యాదగిరి గౌడ్, ఉల్లెంగ చిన్న పర్వయ్య, మహేష్, సాయిలు, రాఘవులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








