– విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని” న్యూ కామన్ డైట్ మెనూ”ప్రారంభం
– విద్యార్థులకు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలి
– రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం రోజు బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో” న్యూ కామన్ డైట్ మెను”ను ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజ్ లు కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో వారు పాఠశాల వంటగదిని తనిఖీ చేసి కూరగాయలను, పప్పులను, వంట సామగ్రిని పరిశీలించారు.

అనంతరం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని ప్రతిరోజు అందించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యం చేస్తూ కల్తీ ఆహారాన్ని విద్యార్థులకు అందించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని.. వారి పై ఖర్చు చేసే డబ్బులను ఆర్థిక భారం అనుకోకుండా బాధ్యతగా భావించి విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలను పెంచి “న్యూ కామన్ డైట్ మెనూ”విధానాన్ని అమలు చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








