V1News Telangana

best news portal development company in india

ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు మాదిగలు మరో ఉద్యమానికి పిడికిలెత్తాలి….

SHARE:

– మన హక్కుల సాధన కొరకు యావత్తు మాదిగ జాతి సిద్ధం కావాలి

– ఐకమత్యం పేరుతో మాదిగ జాతిని అణగదొక్కాలని మాల సంపన్న వర్గాల కుట్ర

– “మసి పూసి మారేడు కాయ” అన్నట్లుగా దొంగ ప్రేమలు ఒలకబోత

– ఉద్యమాల పేరిట కాలయాపన చేస్తూ మాదిగ జాతికి ద్రోహం

– ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు సామెల్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ వేయడం జరుగుతుందని .. ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు సామెల్ కోరారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహిస్తాము అని తెలిపారు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ కొరకు మాదిగ ఉప కులాలు మరో పోరాటానికి సిద్ధం కావాలని.. సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్లుగా నిర్విరామ పోరాటం ఫలితంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మాదిగలు విజయ సంబరాలు జరుపుకుంటే.. కొంతమంది స్వార్థ పరులు, సంపన్న మాలవర్గాలు ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా అడ్డుపడుతూ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎంతమంది అడ్డు వచ్చినా వర్గీకరణ ఆగదని అందుకు యావత్తు మాదిగ జాతి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తమ హక్కుల సాధన కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి.. కానీ సోదర కులాలకు ప్రత్యేక హక్కులు చెందకూడదని అక్కస్సుతో వర్గీకరణ అడ్డుకోవడానికి ఐకమత్యంగా ఉండాలనే దొంగ సాకుతో “మసిపూసి మారేడు కాయ”అన్నట్లుగా మాదిగ జాతిపై దొంగ ప్రేమలు ఒలకబోస్తూ తమ ఆధిపత్యాన్ని చలాయించుకుంటూ మాదిగ జాతి ప్రజలను అణగద్రొక్కాలని మాల వర్గానికి చెందిన సంపన్నులు ఉద్యమాల పేరిట కాలయాపన చేస్తూ ద్రోహం తలపెడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని యావత్తు సమాజం గమనిస్తున్నదని వారిని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, విద్యావేత్తలు మరియు యువకులు అందరూ కలిసి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గురుగల్ల బాలరాజ్, మాదిగ సాయిలు, టేకుర్ల సాయిలు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మెక్కసాయి, డి .సాయిలు, ఎడ్ల విట్టల్, మాదిగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india