V1News Telangana

best news portal development company in india

గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల గిరిజన గురుకుల పాఠశాలలో గురుకుల హెడ్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటరీ సూర్య ప్రకాష్ రెడ్డి శనివారం రోజున కామన్ డైట్ ప్లాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాపకంగా ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావ్, బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, వైస్ ప్రిన్సిపల్ రాహుల్, పోశెట్టి, గిరిజన గురుకుల పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు, పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india