– పాలకులకు, ప్రజలకు మధ్య వారధిగా పాత్రికేయులు
– ప్రజా సమస్యలను వెలికి తీసి పరిష్కారానికి కృషి
– జర్నలిస్ట్ ల పై జరిగే దాడులను ప్రభుత్వం కట్టడి చేయాలి
– బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల నూతన ప్రెస్ క్లబ్ పాలకవర్గానికి శనివారం రోజు బిజెపి పార్టీ తరఫున మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు ముత్తకుంత వేణు గోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పడమటి నగేష్, కోశాధికారి కొండ ప్రవీణ్, కప్పల రమేష్ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ ప్రజలకు, పాలకులకు మధ్యన వారధిగా పనిచేస్తూ సేవలందిస్తున్న పాత్రికేయులందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రజా సమస్యలను అనునిత్యం వెలికి తీసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం కొలువుదీరిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జర్నలిస్టు దాడులను ఆయన వ్యక్తిగతంగా ఖండించాడు.

పాత్రికేయులు కేవలం ప్రజా సమస్యలను వెలికితీస్తారే తప్ప సమస్యను సృష్టించేవారు కాదని ఆయన అన్నారు. ఇటువంటి విషయాలను కొంతమంది జీర్ణించుకోలేక వారి తప్పులను వెలికితీస్తున్నారన్న ఉద్దేశంతో వారిపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ దాడులు నిర్వహిస్తున్నారని.. ఇటువంటి దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందని గుర్తు చేశారు. జర్నలిస్టులపై దాడులు చేస్తే తీవ్రంగా శిక్షించాలని అప్పుడే అటువంటి వారిలో మార్పు వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబిసి జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, మండల ఉపాధ్యక్షుడు , అనుసూరి శ్రీనివాస్, ఉల్లెంగ గోపి,కంది పెద్ద మల్లేష్ , సాయిలు, మహేష్ , రాఘవులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








