– పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పనిచేస్తా
– నిత్యం ప్రజా సమస్యలపై సేవకుడిగా ఉంటాను
– సభ్యులందరి సహకారంతో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తాను
– అధ్యక్షుడు ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల రామాలయం ప్రాంగణంలో శుక్రవారం రోజు నసురుల్లాబాద్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. నూతన అధ్యక్షుడిగా ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్ ను సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పనిచేస్తానని.. నిత్యం ప్రజా సమస్యలపై సేవకుడిగా ఉంటానని అన్నారు. తన పై నమ్మకం తో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదవిగా భావించకుండా బాధ్యతగా భావించి పనిచేస్తానని అన్నారు.

ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ రాజా గౌడ్, ప్రధాన కార్యదర్శి గా పడమటి నగేష్, కోశాధికారిగా కొండ ప్రవీణ్ కుమార్, సహయ కార్యదర్శిగా కప్పల రమేష్, సలహాదారులుగా మహెబూబ్, వంగ శ్రీధర్ గౌడ్, ఠాకూర్ భవాని సింగ్, గాండ్ల సంతోష్ కుమార్, సభ్యులు హన్మండ్లు , దాది మల్లేష్, బూర్గుల మహేష్ గౌడ్, ఎండి. మహెబూబ్ లను నియమించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








