V1News Telangana

best news portal development company in india

భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రవాస భారతీయుడు …..

SHARE:

– నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది

– భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండంతరాలు దాటించిన గొప్ప నాయకుడు

– కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సహకరిస్తాను

– ప్రవాస భారతీయుడు కోనేరు శశాంక్

V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందిన కోనేరు శశాంక్ (NRI) గురువారం రోజు కామారెడ్డి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు అరుణతార మరియు బాన్సువాడ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ క్రమంలో వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని తెలిపారు. త్వరలోనే కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభిస్తానని.. దాని ద్వారా పేద ప్రజలకు తన వంతు సహాయంగా ఆదుకుంటానని తెలిపారు. అనాధ పిల్లలు, నిరుపేద విద్యార్థినీ ,విద్యార్థులకు వారి చదువుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల అధ్యక్షుడు శంకర్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india