V1News Telangana

best news portal development company in india

*సమగ్ర శిక్షా ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి …* PDSU జిల్లా అధ్యక్షులు *ఆర్ గౌతమ్ కుమార్* డిమాండ్….

SHARE:

*సమగ్ర శిక్షా ఉద్యోగస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి …*
PDSU జిల్లా అధ్యక్షులు *ఆర్ గౌతమ్ కుమార్* డిమాండ్…

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుండి అనిల్ టాకీస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి PDSU జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరి పాత్ర విద్యా శాఖలో కీలకమైనదని తెలిపారు, గత 18 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలలో కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వీరిపై నిర్లక్ష్య ధోరణి చూపడాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు, కొత్త ప్రభుత్వాము వచ్చినా విద్యారంగాన్ని తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం రేవంత్ రెడ్డి సర్కార్ కి చెల్లిందన్నారు, గత ప్రభుత్వ హయాంలో సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ సమ్మె చేస్తే రేవంత్ రెడ్డి గారు ,సీతక్క గారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగులందర్నీ రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన కనీసం వారితో చర్చలు జరుపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యాశాఖలో సమ్మె ప్రభావంతో పనులన్నీ స్తంభించిపోయిన ప్రభుత్వము స్పందించకపోవడం సిగ్గుచేటుకరమ్మన్నారు, విద్యా వ్యవస్థ సవ్యంగా కొనసాగాలంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు .సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అందరికీ PDSU విద్యార్థి సంఘం పూర్తి మద్దతు ఉంటుందని సమ్మె ద్వారా ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు n. కార్తీక్ జిల్లా నాయకులు k సాయినాథ్ , ఆకాష్ కుమార్, శ్రీకాంత్, భీమ్ రావు, సుధాకర్, వనజ, ప్రియా, రమణి, లతోపాటు సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india