V1News Telangana

best news portal development company in india

గంజాయి మత్తు యువత చిత్తు …

SHARE:

సిగరెట్ లో జాయింట్ పేరిట సేవనం…

నిజామాబాదు జిల్లా లో గంజాయి సేవనం గత కొద్ది రోజులుగా కొత్త ట్రెండ్ గా మారింది కొన్ని సంవత్సరాల క్రితం గంజాయి సేవనం కేవలం పట్టణాల్లోనే మాత్రము ఉండేది ఇప్పుడు గ్రామాల్లో యువత దీన్ని సిగరెట్లు కలుపుకొని జాయింట్ పేరిట ఇష్టనుసారం గా తీసుకుంటున్నరు. గంజాయి మత్తులో వచ్చేస్తే ఇక లోకమే వాడికి వేరేలా అనిపిస్తది ఎవర్ని కొట్టాలి ఎవరిని చంపాలి అనే ఆలోచన గంజాయి తీసుకున్నవారికి వస్తుంది.మహిళా ల పైన అత్యాచారాలు ఎక్కువగా గంజాయి సేవనం చేసిన వారి వలన జరుగుతున్నాయాని కొందరు మేధావుల అభిప్రాయం. రాత్రిపూట ఓపెన్ గ్రౌండ్ ప్రాంతంలో లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో వెళ్లి అక్కడ గంజాయిని సేవిస్తున్నారు. గంజాయి తీసుకోవడానికి ఒక చిన్న బాటిల్, పెన్ను పుల్ల, సిగరెట్టు ఒక అగ్గిపుల్ల కొద్ది మాత్రం గంజాయిని తీసుకొని సిగరెట్లు వేసి దాన్ని అగ్గి పెట్టేసి జాయింట్ అనే పేరిట యువకులు తాగి సర్వ నాశనం అయిపోతున్నారు. తమ పిల్లలు చిన్న వయసులోనే గంజాయి మత్తులు మున్గడం వలన తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారిపైన గంజాయి రాయులు ఎదిరింపులు చేయడం బెదిరింపు చేయడం వీలైతే వాళ్ల కొట్టడానికి కూడా ఈ గంజాయి రాయులు వెళ్తున్నారని కొందరు తల్లిదండ్రులు సైతం చెప్పుకొస్తున్నారు. సంబధిత శాఖ అధికారులు గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని తమ పిల్లలను గంజాయి భారీ నుండి కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india