V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:బాన్సువాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నాడన్నారు. ఎప్పుడు చూసిన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఓటేసి ఎన్నుకున్నది కేసీఆర్ కంటే బాగా పని చేస్తావని కానీ ఇలాంటి రాజకీయాలు చేస్తావని అనుకోలేదన్నారు.రైతులకు రుణమాఫీ ఇప్పటి వరకు 50% కూడా చేయనందుకు సిగ్గుపడాలన్నారు .400 వాగ్దానాలు చేసిన వ్యక్తివి వాటిని అమలు చేసే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ మీద.. గత ప్రభుత్వం మీద అబాండాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విఫలమయ్యారని అన్నారు. ప్రజలతో తిట్లు తింటూ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా తల్లులు బంగారు కిరీటాలు, బోనాలు ఆభరణాలు వేసుకుంటారని కెసిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొంగలు పడి ఆభరణాలు దోచుకుపోయినట్లు బోసిపోయేలా తయారు చేయించారని మండిపడ్డారు.ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలే ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని తెలిపారు.ప్రభుత్వాన్ని మేము కూల్చమని ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, మహేష్, అఫ్రోజ్, భూమేష్, గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, దొంతి శ్యామ్, దేశ్ పాక్ సాయిలు, మోసీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








