V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
బాన్సువాడ: తెలంగాణ మలి దశ ఉద్యమ కారుల ఫోరమ్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణం కేంద్రంలో గల R&B అతిథి గృహంలో మంగళవారం రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎర్రవట్టి సాయిబాబా మరియు మండల ప్రధాన కార్యదర్శి గంజి వారి చందు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీ లలో భాగంగా ఆరవ హామీ మలి దశ ఉద్యమ కారులకు 250 గజాల స్థలం మరియు గృహ నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమకారులు అలుపెరుగని పోరాటం చేసి పోలీసు కేసులకు, ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడలేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడిచినప్పటికీ ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును మళ్లీ మీరు కూడా చేయవద్దని వేడుకున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక రాష్ట్ర సాధనలో మలి దశ ఉద్యమ కారులు అందించిన సేవలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమ కారులకు ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా మలి దశ ఉద్యమకారుల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉడుత గంగాధర్,ఎర్రవట్టి సాయిబాబా,గంజివార్ చందు, దండు విజయ్ ,భీమా నాయక్, కృష్ణ,భాస్కర్ గౌడ్, సాయికుమార్ ,బురిగారి మహేష్ ,మారుతి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








