V1News Telangana

best news portal development company in india

ఇసుక టిప్పర్లు పట్టారు వదిలిపెట్టారు గతంలో ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తుండే ఇక్కడ విధులు లేకుండా విధుల పేరుతో ఇసుక టిప్పర్ల వద్ద భారీగా వసూలు చేసి ఇతర అధికారులకు మేనేజ్ చేసుకుని సుమారు 10 ఇసుక టిప్పర్లను వదిలిపెట్టిన వైనం రాత్రిపూట జోరుగా ఇసుక టిప్పర్లు, ఇసుక అక్రమ రవాణా ఇక్కడ డ్యూటీ లేని అధికారి ఇసుక టిప్పర్ల వద్ద భారీగా వసూలు చేయడం ఏమిటి

SHARE:

ఇసుక టిప్పర్లు పట్టారు వదిలిపెట్టారు
గతంలో ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తుండే
ఇక్కడ విధులు లేకుండా
విధుల పేరుతో ఇసుక టిప్పర్ల వద్ద భారీగా వసూలు చేసి
ఇతర అధికారులకు మేనేజ్ చేసుకుని సుమారు 10 ఇసుక టిప్పర్లను వదిలిపెట్టిన వైనం
రాత్రిపూట జోరుగా ఇసుక టిప్పర్లు, ఇసుక అక్రమ రవాణా
ఇక్కడ డ్యూటీ లేని అధికారి ఇసుక టిప్పర్ల వద్ద భారీగా వసూలు చేయడం ఏమిటి…

బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు మండలం మంజీరా సరిహద్దు ప్రాంతాల గ్రామాల నుంచి ప్రతిరోజు రాత్రిపూట అదే విధంగా ఉదయం ఇసుక టిప్పర్లు ప్రధానంగా కోటగిరి మండలం సుంకిని తో పాటు, సాలూర మండలం మందర్న నుంచి, బోధన్ మండలం ఇసుక సరిహద్దు ప్రాంతాల నుంచి, ప్రతిరోజు రాత్రి ఉదయం ఇసుక టిప్పర్లు భారీగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. జోరుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునుగుతున్నారని అటువైపు కన్నితి చూడటం లేదని మండిపడుతున్నారు. బోధన్ సాలురా మండలంలో ఓ అధికారి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహించి ఉన్నారని, సదురు అధికారి ఇక్కడ విధులు లేనప్పటికీ, ఇసుక టిప్పర్లు ఇతర వాహనాల ద్వారా, భారీగా డబ్బులు వసూలు చేస్తూ ఇసుక టిప్పర్ను వదిలిపెట్టడం అవివేకమని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి,
శుక్రవారం అర్ధరాత్రి మందన్నతో పాటు ఇతర చోట నుంచి వస్తున్న ఇసుక టిప్పర్లు సుమారు 10 వరకు వాటిని అధికారి ఇక్కడ విధులు లేనప్పటికీ పట్టుకొని మామూలు తీసుకొని వదిలి పెట్టినట్టు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక్కడ విధులు లేని అధికారులకు తరఫున ఇసుక టిప్పర్ల పై హాజమైసి ఏమిటి వసుల పర్వం ఏమిటని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. అక్రమంగా తర్లుతున్న ఇసుక టిప్పర్లను పట్టుకొని వదిలిపెట్టడం ఏమిటి అని ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిరోజు చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఇసుక టిప్పర్లు లారీలు మాత్రం, ఉదయం అనుమతుల పేరిట నంబర్ ప్లేట్ లేని వాహనాలు, అధికలోడుతో వాహనాల ద్వారా ఇసుక తరలిస్తున్నారని,

ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు, అదేవిధంగా లైసెన్సు లేని డ్రైవర్లు అర్హత లేని డ్రైవర్లు అతివేగంగా వాహనాలు తీసుకువెళ్లిన, తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదని, ఇసుక మాఫిదారులకు రాజకీయ అండదండలు ఉండడం వలన ఇసుక మాఫియా జోరుగా చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, ఇసుక మాఫిదారులకు రాజకీయ అండదండలు ఉండడంవల్ల పోలీసు రెవెన్యూ ఇతర శాఖలపై ఒత్తిడి ఉండడం వల్ల, అధికారులు సైతం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనుమానాలు, వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా అక్రమంగా తరులుతున్న ఇసుకపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india