V1News Telangana

best news portal development company in india

“గిరిజన గురుకుల బాట” అడ్డుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో నాసిరకం, విషతుల్య ఆహారం భుజించడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల క్షేత్రస్థాయిలో నాయకులు గురుకులాలను సందర్శించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు నాయకులు మోచి గణేష్ ఆధ్వర్యంలో గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించారు.

ఈ క్రమంలో పోలీసులు మరియు ప్రిన్సిపాల్ వారిని లోపలికి అనుమతించకపోవడంతో పాఠశాల ఎదురుగా బైటాయించి ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, అఫ్రోజ్, శివ సూరి, గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, దుంతి శ్యామ్, సీనియర్ నాయకులు శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india