V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిధుడు, రాజనీతిజ్ఞుడు, సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న అవార్డు గ్రహీత డా. బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నరుల్లాబాద్ మండల మాల కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా పెత్తందారుల అణచి వేతకు గురికా బడిన దళితులు జీవితాలలో వెలుగులు నింపిన మహానుభావుడని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఉల్లెంగ బాల సాయిలు, మాజీ అధ్యక్షులు మామిడి భూమయ్య ,ప్రధాన సలహాదారులు గౌడి నరసింహులు, ఉల్లెంగ చిన్న సంగయ్య ,గ్రామ మాల సంఘం అధ్యక్షులు ఉల్లెంగ కిరణ్, ఉపాధ్యక్షులు మామిడి చిన్న మక్కయ్య, ఉల్లెంగ రాములు,గైని భరత్, కొర్రి మొగులయ్య,ఉల్లెంగ హన్మండ్లు,కొర్రీ సాయిలు, గల్లెంక పోచయ్య, ధ్యాగలి బాలయ్య, కొరి పోశయ్య తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








