V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాల్య వివాహాలను అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని “ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్”స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సోలంకి రవళి అన్నారు. బుధవారం రోజు గాంధారి మండల కేంద్రంలో గల ఏకలవ్య పాఠశాలలో బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలు వినియోగం, “గుడ్ టచ్ బ్యాడ్ టచ్”, మానవ అక్రమ రవాణా, సామాజిక ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెదలాలని అన్నారు. వారి అభీష్టాలను తెలుసుకొని వారిపై ఒత్తిడి కలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








