V1News Telangana

best news portal development company in india

గురుకుల పాఠశాల ముందు నిరసన తెలిపిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ….

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో విషతుల్య ఆహారం భుజించడం వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై .. కొందరు విద్యార్థులు మరణించిన నేపథ్యంలో దానికి నిరసన తెలుపుతూ బుధవారం రోజు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారామ్ యాదవ్, బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు నాయకులు మోచి గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రోజు బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లగా వారిని లోపలికి అనుమతించకపోవడంతో ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద, అణగారిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఇంత చిన్నచూపు చూడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, శివ సూరి, మహేష్, లింగం, శ్రీకాంత్, అఫ్రోజ్, గొడిసెల నర్సింలు గౌడ్, టి, సాయిలు, దొంతి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india