Post Views: 98
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి.. బదిలీపై ఇతర పాఠశాలకు వెళ్లినటువంటి ఉపాధ్యాయులకు పాఠశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు .అదేవిధంగా నస్రుల్లాబాద్ పాఠశాలకు నూతనంగా బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చందర్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. హన్మండ్లు, ఉపాధ్యాయులు రుక్మిణి, ప్రియాంక ,కాంచన, పుష్పలత, అనూష, స్వప్న, రూప, సురేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








