– మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులను బెదిరించిన వైనం
– యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి
– కాకతీయ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి
– జస్విత్ రెడ్డి కుటుంబ సభ్యుల డిమాండ్
V1 న్యూస్ బోధన్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా:ఇటీవల నిజామాబాద్ పట్టణం లోని కాకతీయ విద్యాసంస్థలో జస్విత్ రెడ్డి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.. బోధన్ మండలం ఆచన్ పల్లి గ్రామానికి చెందిన జశ్విత్ రెడ్డి కుటుంబ సభ్యుల పై యాజమాన్యం సిబ్బంది దాడికి పాల్పడుతూ బెదిరించిన సంఘటన బుధవారం రోజు చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… బోధన్ లోని ఆచన్ పల్లి గ్రామంలో ఉదయం నిజామాబాద్ లోని కాకతీయ విద్యాసంస్థల ఉద్యోగులు మృతుడి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పోలీస్ కేసు వాపసు తీసుకోవాలని భయబ్రాంతులకు గురి చేసి భౌతిక దాడికి యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. నిజామాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తీసుకు వచ్చారు. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు డయల్ 100 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం తో బోధన్ పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కాకతీయ విద్యాసంస్థల ఉద్యోగులను పోలీసు స్టేషన్ కు తరలించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ హెచ్ వో వెంకట నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జస్విత్ రెడ్డి మరణించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








