V1News Telangana

best news portal development company in india

చదువు విద్యార్థులకు శాపమా…. లేక లోపమా…?

SHARE:

– కళాశాలల్లో విద్యార్థుల వరుస మరణాలకి కారణాలు ఏమిటి

– ఇది అధికారుల నిర్లక్ష్యమా పాలకుల పట్టింపు లేని తనమా

– ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పగలదా

– కళాశాలలో విద్యార్థి చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ఆ సంస్థనే భరించాలని విద్య హక్కు చట్టంలో పొందుపరచాలి

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలి

– బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి, తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు పుట్ట భాస్కర్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బలవన్మరణాల పట్ల నిరసన తెలుపుతూ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు పుట్ట భాస్కర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తులకు బంగారు బాటలు వేసుకుంటారని తల్లిదండ్రులు అప్పుల పాలైనప్పటికీ వారి పిల్లలను లక్షలు వెచ్చించి హైదరాబాద్ లో ఉండే కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తున్నారన్నారు. అయితే ప్రతి ఏడాది ఎంతోమంది విద్యార్థులు కళాశాలలు, పాఠశాలల్లో, వసతి గృహాలలో , బాత్రూంలలో బలవన్మరణానికి పాల్పడుతున్నారన్నారు. ఈ విధంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలను మాత్రం ప్రభుత్వాలు ,విద్యాసంస్థలు, తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మనకెందుకులే చనిపోయింది మన పిల్లవాడు కాదు కదా అనుకుంటూ కొందరి తల్లిదండ్రులు అభిప్రాయం పడుతున్నారన్నారు.కానీ అలాంటి సమస్యతో వారి పిల్లలు కూడా చెప్పుకోలేక లోలోపలే కుములిపోతున్నారని అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. సమస్య వారి వరకు వస్తే గానీ ఈ విషయం వారికి అర్థం కావటం లేదు.. చదువు అనేది ఎప్పుడు కూడా నిర్బంధంలో ఉండకూడదు స్వచ్ఛమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా విద్యను అందించాలి…కానీ హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో అన్నీ కూడా భవనాల్లో నిర్వహించడం వల్ల. పిల్లలు ఆడుకోవడానికి కనీసం క్రీడా ప్రాంగణాలు కూడా ఉండవు విద్యార్థులని కనీసం గేటు దాటి బయటకు కూడా రానివ్వకుండా నిర్బంధంలో ఉంచి విద్యను అందిస్తుంటారన్నారు..అది చాలామంది విద్యార్థులకి నరకప్రాయంగా ఉంటుందని.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎన్నిసార్లు వివరించినప్పటికీ వారు వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో పట్టించుకోవటం లేదు..అలా చాలాసార్లు చెప్పి చూసి విద్యార్థులు వారికి చదువు కంటే వారి భవిష్యత్తు కంటే చావే మేలనుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు..చదువు ఎప్పుడయితే వ్యాపారంగా మారిపోయిందో అప్పటినుండి విద్యార్థులు బలిపశువులుగా మారిపోయారన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పింది వింటూ గంగిరెద్దుల్ల తల ఊపు తున్నారన్నారు. ఈ పద్ధతి మారాలి.. దీనిని మార్చడానికి ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుని విద్యాసంస్థల్లో విద్యార్థులు చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలన్నారు.అలాగే కచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెబుతూ అబద్ధాలు చెబుతున్న కార్పొరేట్ కళాశాలల పైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా విద్యా హక్కు చట్టంలో కటిన నిర్ణయాలను పొందుపరచాలన్నారు.. ఈ విషయం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ఇంకా ఎంతో మంది విద్యార్థులను చదువు అనే కార్పొరేట్ భూతం బలి తీసుకుంటూనే ఉంటుందన్నారు..ఒకసారి తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించాలని పిల్లలకు దేని పట్ల ఆసక్తి ఉందో వారితో అదే చేయిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు.
ఏది ఏమైనా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.. లేదంటే కార్పోరేట్ చదువు ఇంకా ఎంతో మంది జీవితాలను కబళించి వేస్తుందన్నారు.. అల్లారు ముద్దుగా పెంచుకునే బిడ్డలను వారి తల్లిదండ్రులకు దూరం చేస్తూ శోకసంద్రంలో ముంచుతుందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి విద్యా సంస్థల యాజమాన్యాల పని పని తీరుపై ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india