V1News Telangana

best news portal development company in india

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

SHARE:

– ప్రణాళిక బద్ధంగా వ్యాపారాలు నిర్వహించుకుని వృద్ధి చెందాలి

– రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ప్రజా పాలన విజయ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రోజు పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా గత ఏడాది కాలంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్వయం సహాయక గ్రూపు (SHG) మహిళా శక్తి సభ్యులకు మరియు వీధి వ్యాపారులకు బ్యాంకు ద్వారా మంజూరు చేయబడిన చెక్కులను పంపిణీ చేశారు.

వారికి ప్రణాళిక బద్ధంగా కష్టపడి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలని సూచించారు. ఇటీవల పట్టణంలో ప్రారంభించిన” ఇందిరా మహిళా శక్తి”క్యాంటీన్ ను సందర్శించి నాయకులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని మాత శిశు ఆసుపత్రి ఆవరణలో తాత్కాలికంగా నిర్మించే షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఎజాస్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india