V1News Telangana

best news portal development company in india

శ్రీకాంత్ చారి ప్రాణ త్యాగం వెలకట్టలేనిది

SHARE:

– మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు

– ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు

– నిస్వార్ధంగా రాష్ట్ర సాధనకై ప్రాణాలర్పించిన తొలి అమరవీరుడు

– తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి అస్తమించిన ఆణిముత్యం

– బిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జుబేర్ వ్యాఖ్యలు

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుడైన కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ శ్రీకాంత్ చారి తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో రగిలించి అగ్నికి ఆహుతై అసువులు బాసి ఉద్యమాన్ని ఉదృతం చేయడంలో కీలక పాత్ర పోషించిన తొలి అమరవీరుడని అన్నారు. ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసి.. ఆనాటి ప్రభుత్వం ఉద్యమకారులపై జరిపిన దాడులను, దమన కాండను చూసి భరించలేక ..ఉద్యమం నీరుగారి పోతుందేమోనని భయంతో ప్రాణ త్యాగానికి పూనుకొని.. తనువు చాలించి తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చాడని గుర్తు చేసుకున్నారు. యువకులకు ఆయన చేసిన త్యాగం ఎంతో పూర్తినిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మోచే గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, చాకలి మహేష్, గౌస్, నల్లోల్ల సాయిలు, బోర్లం అనిల్, ఆటో మౌలా, జావేద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india