– పోచారం కుటుంబం జోలికి వస్తే సహించేది లేదు
– అన్నం పెట్టిన చేతును కాటేసాడు
– బీర్కూర్ మండలంలో నియంత పాలన కొనసాగించిన తీరు అని ఘాటు వ్యాఖ్యలు
– అక్రమ ఆస్తులు కూడ గట్టుకొని ముసలి కన్నీరు కారుస్తున్నాడు
– మండలంలో ఏ నాయకుడిని ఎదగనివ్వలేదు
– ఆగ్రహం వ్యక్తం చేసిన యువజన నాయకుడు మియాపురం శశికాంత్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు భాస్కర్ రెడ్డిల గురించి మీడియా సమావేశం నిర్వహించి అసత్య ప్రచారాలు చేస్తూ వారిపై ఆరోపణలు చేసిన మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ చర్యలకు నిరసనగా సోమవారం రోజు బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఉభయ మండలాల నాయకులు గోపీనాథ్ గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం వల్ల పదవులు మరియు ఆస్తులు కూడగట్టుకొని ఈరోజు సంస్కారహీనంగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.

శ్రీనివాస్ రెడ్డి తన సొంత కుమారుల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ద్రోణవల్లి సతీష్ అనే నాయకుడు బీర్కూర్ మండలంలో నియంతృత్వ పోకడలకు పోయి అన్ని రకాలుగా నాయకులను, కార్యకర్తలను, అధికారులను చాలా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. శ్రీనివాసరెడ్డి వల్ల ఎటువంటి లబ్ధి పొందలేదని అనడం పట్ల వారు స్పందిస్తూ.. రాజకీయాలలోకి రావడానికి ముందు మీ ఆస్తులు ఎన్ని అంటూ ప్రశ్నించారు. ఈరోజు ఇన్ని ఎకరాల భూములు ఎలా కొనుగోలు చేశావని నిలదీశారు. నమ్మిన బంటుగా 30 సంవత్సరాల పాటు వారితో పనులు చేయించుకొని లబ్ధి పొంది ఈరోజు వారిని విమర్శించడం తన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

బీర్కూర్ మండలంలో ఏ ఒక్క నాయకుడిని కూడా ఎదగకుండా వారి రాజకీయ జీవితాలను నాశనం చేశాడని విమర్శించారు. యువకులను, కార్యకర్తలను తన స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ వారితో పనులు అయిపోయిన తర్వాత తెలివిగా వారిని పక్కకు తప్పించేవాడని ఆరోపించారు. విభజించి పాలించు అనే నినాదంతో అన్నదమ్ముల మధ్య లో మరియు తండ్రి, కొడుకుల మధ్యలో గొడవలు సృష్టించి తన దారికి ఎవరు అడ్డు లేకుండా చేసుకుంటూ వచ్చాడన్నారు.

పోచారం భాస్కర్ రెడ్డి అనుచరులు, నాయకులు, కార్యకర్తలు, ఆగ్రహంతో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, వైస్ చైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సందీప్, మాజీ సర్పంచ్ సానెపు గంగారం, యువజన నాయకులు శశికాంత్, ఆరిఫ్, దుంపల రాజు, కోరిమే రఘు, సాహెబ్ రావ్, మాజీ ఎంపీపీ విట్టల్, బీర్కూర్, నసురుల్లాబాద్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








