V1News Telangana

best news portal development company in india

కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆదివారం రోజు కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కిష్టయ్య విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమానికి ఊపిరి పోసారన్నారు.

ఇలాంటి ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ వారి త్యాగాలను మర్చిపోలేమన్నారు. అనంతరం కిష్టయ్య వర్ధంతి సంస్మరణ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, గడమల లింగమేశ్వర్, కొంకి విట్టల్, కాలేక్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india