V1News Telangana

best news portal development company in india

కానిస్టేబుల్ కిష్టయ్య కు నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం రోజు అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మోచి గణేష్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమం నీరు గారి పోతుందని తాను ప్రాణత్యాగానికి పూనుకొని సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని తుది శ్వాస విడిచారన్నారు. ఉద్యమానికి ఊపిరినూది తెలంగాణ ప్రజల మదిలో పోరాడే స్ఫూర్తిని నింపారన్నారు. ఆయన త్యాగాన్ని తెలంగాణ ప్రజానీకం ఎప్పటికీ మరువలేనిది అన్నారు. ఎందరో త్యాగదనుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, గౌస్, శివ సూరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india