– చందూరి హన్మాండ్లు బీజేపీ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా:వరంగల్ జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది, కాజీపేట రైల్వే కోచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు ధన్యవాదాలు తెలిపారు.విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని కాజీపేట లోని వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీని ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గా అప్ గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గురువారం రోజు ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో కీలక భేటీ జరిగిందని.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృతంలోజరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రాజెక్టు 2025 ఆగష్టు వరకు పూర్తి చేయనున్నారని.. త్వరలోనే కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేట సమీపంలో ఉన్నటువంటి అయోధ్య పురిలో 160 ఎకరాలలో 521 కోట్లతో వ్యాగన్ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ యూనిట్ దేశంలోనే రెండో అతిపెద్ద యూనిట్ గా ఏర్పాటు కానుందని తెలిపారు. సుమారుగా 4000 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని .. దీని ద్వారా మొదటి ఏడాది 1200 వందల వ్యాగన్ల తయారీ,రెండవ ఏడాది 2400 వ్యాగన్ల తయారు చేస్తారన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన రైల్వే లో వ్యాగన్ల తో పాటు, కోచ్ లు, రైలింజన్లను తయారుచేస్తారన్నారు. దీనితో పాటు ఎంఎంటీఎస్,వందే భారత్ కూడా సంబంధించిన పరికరాలను తయారు చేస్తారన్నారు. గతంలో 1982 లో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనప్పటికీ పంజాబ్ కి తరలించడం జరిగిందన్నారు. మరల ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కృషి వలన తెలంగాణలో ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సమాజం సంతోషం వ్యక్తం చేస్తుందన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








