V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్, నసురుల్లాబాద్ ఉభయ మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి శుక్రవారం రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్ శ్యామల, వైస్ చైర్మన్ రాములు అతిధులను గజమాల మరియు శాలువాతో సత్కరించారు. అనంతరం నూతన పాలకమండలితో డిఇఓ రమ్య ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దుర్గం శ్రీనివాస్ శ్యామలను.. వైస్ చైర్మన్ గా యామరాములు ను నియమించి వారికి శుభాకాంక్షలు తెలిపారు . బాన్సువాడ నియోజకవర్గం లో మూడు మార్కెట్ కమిటీలకు నియామకం పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడి సహకారం తో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్యామలను నియమించడం ..నిజమైన మహిళా కార్యకర్తకు న్యాయం జరిగిందని అన్నారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఒకటి మాత్రమే మిగిలి ఉంది అది కూడా తొందరలో నియామకం చేస్తామన్నారు.

పీసీసీ అధ్యక్షుడి ఆదేశానుసారం బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి ఇచ్చినా మా నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కదా అని స్వాగతిస్తామన్నారు. రాజకీయంలో హుందాతనంగా వ్యవహరించాలని హితవు పలికారు.మరో వర్గం నాయకుల ను అందరిని కలుపు కొని పోవడానికి నేను సిద్దమే కానీ వాళ్లు కలవడం లేదని తెలిపారు. స్వాగతించినప్పుడు అడుగులు ముందుకు రావాలి కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు అన్నారు. మరికొందరు బీర్కూర్ మండలంలో అభివృద్ధి మొత్తం నేనే చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని .. ఏదైనా ఒకరి సహాయం వల్లనే మనకు గుర్తింపు వస్తుందన్నారు. గత కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించడానికి నిధులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో తీసుకు వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా శాయ శక్తుల ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రెడ్డి, ఆవారి గంగారం, మియాపురం శశికాంత్, పెరిక శ్రీనివాస్, పాల్త్య విట్టల్, మాజీద్, కంది మల్లేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








