V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా..బాన్సువాడ బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నవంబర్ 29న కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే” దీక్ష దివస్ ” సన్నాహక కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి ,బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు ముజీబోద్దిన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన , రౌడీ పాలన కొనసాగుతుందన్నారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫోన్ లో వాట్సాప్ డీపీలు, స్టేటస్ లు పెట్టుకుంటే పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో రైతుల వద్ద నుండి 1340 ఎకరాల భూమిని ప్రభుత్వం అక్రమంగా కాజేయాలని చూస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడడానికి అమాయక ప్రజలపై దాడులు జరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజన పేద మహిళలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే ఢిల్లీలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కును పట్టుకొని తిరుగుతుంటే.. రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు.రూ.12,400 కోట్లతొ అదాని రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కేటీఆర్ గుర్తించి ప్రశ్నించడంతో భయపడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అదాని ఇచ్చిన రూ. 100 కోట్ల చెక్కును వాపసు పంపిడన్నారు.

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు, మహిళలు, పురుషులు, చిన్న పిల్లలతో సహా వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందన్నారు. రాష్ట్రంలో విషతుల్యమైన ఆహారం భుజించడం వల్ల విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు.పాఠశాలలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నవంబర్ 29 తేదీన నిర్వహించబోయే “దీక్ష దివస్” కార్యక్రమానికి నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








