V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న కాసిం పై జరిగిన దాడిని ఖండిస్తూ బుధవారం రోజు బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడి జరిగితే రాజ్యాంగంపై కూడా దారి జరిగినట్లేనని అభివర్ణించారు.

కొందరు వారి స్వార్థ ప్రయోజనాలకు, దోపిడీలకు ఆటంకం కలుగుతుందని న్యాయవాదులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చట్టాలు రూపొందించి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రమా కాంతారావ్, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, రామ్ రెడ్డి, ఖలీల్, మొగులయ్య, హైమద్, అయ్యాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








