V1News Telangana

best news portal development company in india

ప్రైవేట్ కళాశాలలో ఆగని ఫీజుల దోపిడి…

SHARE:

ప్రైవేట్ కళాశాలలో ఆగని ఫీజుల దోపిడి…

హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందించక వంకర సమాధానం ఇస్తున్న యాజమాన్యం….

జిల్లా నిజామాబాద్
బోధన్. మండలం లోని కొన్ని ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు కట్టని ఎడల వారి పైన కళాశాల యాజమాన్యం అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఫుడ్డు బాలేదని తల్లిదండ్రులు తమ ఇంటి నుండి పిల్లలను కళాశాలకు పంపిస్తే ఇంటి నుంచి కళాశాలకు పం పించిన హాస్టల్ ఫీజు తప్పనిసరిగా కట్టాలని కట్టని యెడల తమ యాజనం తరపున ఒప్పుకునే ప్రసక్తే లే దని. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తమ వస్తువులు చోరీ అవుతున్నాయని సంస్థకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని భోజన సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల అనారోగ్యాల ఫాలవుతున్నామని కొందరు కళాశాలలో చదువు విద్యార్థులు చెబుతున్నారు.
అదేవిధంగా కళాశాల ఫీజు కట్టని యెడల వారిని గేటు బయట నిలబెడుతున్నారని తల్లిదండ్రులు ఎంత రిక్వెస్ట్ చేసిన వారి మాటలు పట్టించుకోవడంలేదని ఫీజు కడితేనే ఎగ్జామ్స్ రాయడానికి ఇస్తామంటూనారట.వచ్చే జనవరి నెలలో పరీక్షలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన గురవుతున్నారు సంవత్సరం మొత్తం చదివిన చదువు వ్యర్థమవుతుందని వచ్చే కొద్ది రోజుల్లోనే పరీక్షలు ఉండంగా ఫీజు కట్టలేదని విద్యార్థులను ఈ విధంగా చిత్ర హింసలు పెట్టడం సరికాదని ఎట్టి పరిస్థితుల్లో ఫీజులు చెల్లిస్తామని కొంత సమయం ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంతో కోరుతున్నారు.ఆయిన కళాశాల యాజమాన్యం మాత్రం ఫీజు కట్టే దాకా ఎగ్జామ్ రాయించే ప్రసక్తే లేదని సమాధానాలు ఇస్తున్నారట. ఇప్పటికైనా విద్యార్థులను ఫీజుల పట్ల పీడించే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని పీడించడం మానేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india