V1News Telangana

best news portal development company in india

బాన్సువాడలో” దీక్షా దివస్” సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్……

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ అన్ని వర్గాలతో కలిసి.. అలుపెరగని పోరాటం చేసి చివరికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం వలన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని.. మంగళవారం రోజు బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం రోజు బాన్సువాడ పట్టణంలో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో షేక్ జుబేర్ ఆధ్వర్యంలో నిర్వహించే” దీక్షా దివస్” సన్నాహక సమావేశానికి..మాజీ ఐపీఎస్ అధికారి, బి.ఎస్.పి పార్టీ రాష్ట్ర అధినేత, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india