V1News Telangana

best news portal development company in india

బోరు మోటర్ బిగించి నీటి వసతి కల్పించిన మాజీ ఎంపిటిసి…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

బాన్సువాడ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతూ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి గ్రామ మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ కు వెంటనే బోరు వేయించి నీటి వసతి కల్పించాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బోరు వేయించి సోమవారం రోజు మోటార్ బిగించి ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి బోరు మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా పరస్పరం మిఠాయిలు తినిపించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి నీటి వసతిని కల్పించినందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు కంది మల్లేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు గుత్తుల శ్రీనివాస్, గొడిసెల నర్సింలు గౌడ్, తోటవార్ భూమేష్, అంగన్వాడి టీచర్ గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india