V1News Telangana

best news portal development company in india

పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన…..

SHARE:

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గం లోని పిట్ల మండలం రాంపూర్ ( కలాన్) గ్రామంలో ఆదివారం రోజు ఎస్సై రాజు ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సాయాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీలు గాని తమ వివరాలు గానీ అడిగినట్లయితే ఎవరూ కూడా ఇవ్వకూడదని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india