*బాన్సువాడ ప్రాంత ప్రజలు కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యాసంస్థను బహిష్కరించండి. PDSU(S) – TSP విద్యార్థి సంఘాల విజ్ఞప్తి.*
ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (స్టూడెంట్) PDSU(S) తెలంగాణ స్టూడెంట్ పరిషత్ TSP విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాన్స్ వాడ పట్టణంలోని సాయికిర్తి జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా PDSUS జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్, TSP జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ లు మాట్లాడుతూ బాన్స్వాడ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలను ఈ కార్పొరేట్ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య విద్య సంస్థను బహిస్కరించాలని, ఈ విద్య సంస్థను ప్రజలు మరియు విద్యార్థులు నమ్మవొద్దని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంస్థలో మన ప్రాంత విద్యార్థులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో ఫీజులు, విద్యార్థులపై సిబ్బంది వేదుంపులు ఈ విద్యాసంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. కావున మన ప్రాంత ప్రజలు ఈ విద్యాసంస్థకు దూరంగా ఉండాలని బహిస్కరించాలని ఈ సందర్భంగా బాన్స్వాడ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన బాన్స్వాడ ప్రాంతం లో ఎక్కువ పెద్ద మొత్తంలో రైతు కుటుంబాలు ఉంటాయి. పూర్తిగా వ్యవసాయ పంటలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తాము. ఈ విద్య సంస్థ లో లక్షల రూపాయలు కట్టలేము. మన విద్యార్థుల ప్రాణాలు నిలబెట్టుకోలేము కావున దయచేసి విద్యార్థులు వారి తల్లితండ్రులు అలోచించలని కోరుకుంటున్నాము.ఈ విద్యాసంస్థకి బాన్స్వాడ లో ఇంకా ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండానే అద్దెకు భవనాన్ని తీసుకొని కొనసాగింపు చర్యలు మొదలు పెడుతున్నారు. కావున ప్రజలు ల వద్దకు వారు క్యాన్వాసింగ్ కోసం వచ్చినప్పుడు కానీ మీకు వారినుండి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కానీ వారిని తిరస్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో PDSUS నాయకులు శివకవి, కార్తీక్, సాయికుమార్, విట్టల్ TSP నాయకులు రాజు, కిరణ్, అశోక్ లు పాల్గొనడం జరిగింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








