– ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు
– సొంత పార్టీపై నాయకులు ధర్నా చేయడం హాస్యాస్పదం
– సీనియర్లమని చెప్పుకుంటున్న నాయకులు అందరూ వివిధ పార్టీలు మారిన వారే
– పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి నోటి దురుసు మాటలు మాట్లాడితే ఖబర్దార్
– మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి తమ నియోజకవర్గాల శాసనసభ్యులపై ఆరోపణలు చేస్తూ గాంధీభవన్ ముందు ధర్నా చేసిన విషయం విధితమే ఈ క్రమంలో వారు మీడియా ముందు నియోజకవర్గాల వారీగా తమ శాసనసభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ మాట్లాడారు. వారు మాట్లాడిన తీరును ఖండిస్తూ శుక్రవారం రోజు బీర్కూర్ ఉమ్మడి మండల సీనియర్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ సీనియర్లమని చెప్పుకుంటూ సొంత పార్టీపై బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక పారదర్శకంగా జరిగిందని వివరించారు. ధర్నాలు చేసే నాయకులు గతంలో వివిధ పార్టీలు మారిన వారే నని ఎద్దేవ చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ని ఉద్దేశించి వారు మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని అన్నారు. మార్కెట్ కమిటీ పదవి తమ వర్గానికి చెందిన వారికి రాలేదన్న ఈర్ష్యతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

వారందరూ పోచారం నాయకత్వంలో పనిచేసి విశ్వాసం కోల్పోయిన వారేనని అన్నారు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు తమ ఉనికిని కాపాడుకోవడానికి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ యామ రాములు మాట్లాడుతూ ఈరోజు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ వారికి రథసారధిగా ఉన్న వ్యక్తి కూడా పార్టీలు మారుతూ వచ్చిన వ్యక్తి అని .. స్థానిక ప్రజలు చీకొట్టడంతో బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చి నాయకులను, కార్యకర్తలను ప్రేరేపిస్తూ పార్టీలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ధర్నాలు చేస్తూ తమ ఆరాధ్య నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి భవిష్యత్తులో నోటి దురుసు మాటలు మాట్లాడితే మీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పాల్త్య విట్టల్, తిలకేశ్వరి రఘు, సీనియర్ నాయకురాలు శ్యామల, యువజన విభాగము అధ్యక్షుడు శశికాంత్, ప్రతాప్ సింగ్, అబ్దుల్ మాజిద్, ఆరిఫ్, రాము, సందీప్ పటేల్, మోహన్, సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








