*Breaking ; అదాని అరెస్టుకు రంగం సిద్ధం…!* గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆదేశాలు..
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. అమెరికా జడ్జి ఆ ఆదేశాలు ఇచ్చారు. మల్టీ బిలియన్ డాలర్ స్కామ్‌లో గౌతం అదానీని దోషిగా తేల్చారు. సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం జరిగిన బాండ్ల సేకరణలో అదానీ ముడుపులు ఇవ్వచూపినట్లు తెలుస్తోంది.
265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్లలో దాదాపు రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జడ్జి జారీ చేశారు. ప్రాసిక్యూటర్లు ఆ వారెంట్‌ను .. విదేశీ న్యాయశాఖకు అందజేయనున్నారు.
అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో.. అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా పెట్టుబడీదారులను, అధికారులను మోసం చేసినట్లు గౌతం అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ ఆ అభియోగాలు చేసింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








