V1News Telangana

best news portal development company in india

మైలారం మత్స్యశాఖ సహకార సంఘంలో అక్రమాలు…..

SHARE:

మైలారం మత్స్యశాఖ సహకార సంఘంలో అక్రమాలు…..

– మత్స్యకారులను మోసంచేస్తున్న అధ్యక్షుడు

– మాకు న్యాయం చేయండి అంటున్న మత్స్యశాఖ సొసైటీ సంఘ సభ్యులు..

V1న్యూస్ నసురుల్లాబాద్:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో మత్స్యకార సొసైటీని 1991 సంవత్సరంలో మైలారం మత్స్య శాఖ సహకార సంఘం పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు. కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడుగా కొనసాగుతూ మైలారం సొసైటీని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని.. మాకు న్యాయం చెయ్యాలని నసురుల్లాబాద్ పోలీసులకు గురువారం రోజు ఫిర్యాదు ఇచ్చారు.ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ జయశ్రీ,మాజీ అధ్యక్షులు రాములు మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పల్లికొండ సాయిబాబా గత మూడు దఫాలుగా ఆయనే చైర్మన్ గా కొనసాగుతూ మత్స్యకారులకు రావలసిన ఆదాయానికి గండికొడుతూ మా వద్ద నుండి బైలా రిజిస్టర్, వాట రిజిస్టర్,మినిట్స్ బుక్కు, తీసుకొని దొంగ సంతకాలు ఫోర్జరీ చేసి,బొలెరో వాహనాలను,కారు తీసుకున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్నామన్నారు.

మావి పేద కుటుంబాలు కావడంతో మాకు రావాల్సిన ఆదాయాన్ని గండికోడుతూ మాకు తీవ్ర అన్యాయం చేస్తున్న పల్లికొండ సాయిబాబా అనే వ్యక్తిని, మత్స్యశాఖ డెవలప్ మెంట్ అధికారి డోల్సింగ్ పైచర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని మైలారం మత్స్యకారులు కోరుతున్నారు.అధ్యక్ష పదవి అనేది సంఘ సభ్యుల సమక్షంలో తీర్మానం చేసి ప్రకటించాలి కానీ మత్స్యశాఖ అధికారులతో కుమ్మక్కై సభ్యులతో ఎలాంటి సంతకాలు తీర్మానం లేకుండా నేనే చైర్మన్ అని కొనసాగడం గమనార్హం, అతన్ని అధ్యక్ష పదవి నుండి వెంటనే తొలగించాలని మా సొసైటీ మాకు ఇవ్వకపోతే ఎక్కడ దాకా అయినా వెళ్తామని మత్స్యశాఖ సహకార సంఘం సభ్యులు ముక్తకంఠంతో విలేకరుల సమావేశంలో తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india