V1News Telangana

best news portal development company in india

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి…..

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగేడిగి గ్రామశివారులో వృద్ధురాలు దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే కోటగిరి మండలం నాగేంద్రపురం గ్రామానికి చెందిన మాదవ్వ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాల కొరకు హత్య చేసి ఓ కాలువలో పడేసి వెళ్లిపోయారు. పొలం గట్టుకు వెళ్ళిన ఓ వ్యక్తికి కాల్వ నీటిలో వృద్ధురాలు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచార అందుకున్న బాన్సువాడ సిఐ రాజేష్. బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ సంఘటన స్థలానికి వెళ్లి హత్యకు గల కారణాలు ఆరా తీశారు. నగల కోసమే తన భార్యను హత్య చేసి ఉంటారని మృతురాలి భర్త శంకర్ బీర్కూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india