V1News Telangana

best news portal development company in india

విద్యుత్ చోరీపై విజిలెన్స్ అధికారుల దాడులు…..

SHARE:

V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బుధవారం రోజు విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వారు ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ ను చోరీ చేస్తూ వినియోగించుకుంటున్న వారిపై చర్యలు తీసుకున్నారు. రెండు విద్యుత్ చోరీ కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏఈ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఎర్రమన్ను కుచ్చే ప్రాంతంలో ఒక కేసు, ఇందిరా నగర్ లో మరో కేసు నమోదు చేసామన్నారు. ప్రభుత్వము గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ.. వినియోగదారులు పాత బిల్లు చెల్లించకుండా నేరుగా స్తంభం నుండి సరఫరా అయ్యే విద్యుత్ను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా విద్యుత్ స్తంభం నుండి నేరుగా వచ్చే విద్యుత్ ను వినియోగించడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india