V1News Telangana

best news portal development company in india

వీధి కుక్కల బెడదను నివారించాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలపై మరియు పెద్దలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని.. కుక్కల బెడదను నివారించడానికి చర్యలు తీసుకొని.. చిన్నారులను, ప్రజలను కాపాడాలని కోరుతూ బుధవారం రోజు మదీనా కాలనీవాసులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు అక్బర్ మాట్లాడుతూ పట్టణ వ్యాప్తంగా వీధుల గుండా కుక్కలు స్వైర విహారం చేస్తూ పసి పిల్లలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని అన్నారు. పాదచారులు కూడా గాయాల పాలవుతున్నారు అని తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india