V1News Telangana

best news portal development company in india

చేప పిల్లలను చెరువులో విడుదల చేసిన ఎమ్మెల్యే…..

SHARE:

– మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

– దళారులు మాఫియాల ఏర్పడి మత్స్యకారుల శ్రమను దోచుకుంటున్నారు

– సంబంధిత అధికారులు మత్స్యకారులకు లైసెన్సులు ఇవ్వడం వలన దళారుల ఆగడాలు కట్టడి చేయవచ్చు

– నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తాము

– ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో గల రిజర్వాయర్ లో ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీపై అందజేస్తున్న ఉచిత చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేప పిల్లల పెంపకం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. దళారులు ఒక మాఫియా లాగా ఏర్పడి మత్స్యకారుల శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. సంబంధిత శాఖ అధికారులు మత్స్యకారులకు లైసెన్సులు ఇవ్వడం వలన దళారుల ఆగడాలను కట్టడి చేయవచ్చన్నారు.

మత్స్యకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india