V1News Telangana

best news portal development company in india

బోనస్ డబ్బుల విషయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే…..

SHARE:

– ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వడం సంతోషకరం

– రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

– ఈ ఖరీఫ్ సీజన్ లోరికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్ళు జరిగాయి

– రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ సోమవారం రోజు పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మరియు రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొద్ది రోజులు ఆలస్యమైనప్పటికీ ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా డబ్బులు సక్రమంగా వస్తాయని సూచించారు. అదేవిధంగా బోనస్ కూడా పొందవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్ళు జరిగాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా 65,923 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్ళు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట మేరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేయడం సంతోషకరమన్నారు. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో రైతులకు రూ .2320 మద్దతు ధరతో పాటు బోనస్ రూ.500 ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కొనియాడారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. వివిధ గ్రామాల రైతులు పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. అనంతరం ఆయనను షాలువాతో సత్కరించి.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్వల కృష్ణారెడ్డి, ఎజాస్, పెరిక శ్రీనివాస్, కంది మల్లేష్, పాల్త్య విటల్, అబ్దుల్ మాజీద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india