V1News Telangana

best news portal development company in india

తలపై హెల్మెట్ ధరించకపోవడం ప్రాణాలకు ముప్పు…..

SHARE:

V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ద్విచక్ర వాహనాలు నడిపేవారు తలపై హెల్మెట్ తప్పకుండా ధరించాలని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి అన్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వల్ల ప్రాణాలకు ముప్పు అనే విషయం ప్రజలందరూ గమనించాలని తెలిపారు. ఆదివారం రోజు జాతీయ రహదారిపై ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రయాణం చేసేటప్పుడు వాహనాల యొక్క ఒరిజినల్ ఆర్. సి, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ పత్రాలను తప్పక తమ వెంట తీసుకురావాలన్నారు. ఈ తనిఖీలు నిర్వహించేటప్పుడు ఆయన వెంట కానిస్టేబుల్ పాండు, శేషు, హోంగార్డు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india