V1News Telangana

best news portal development company in india

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రక్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..

SHARE:

V1 జుక్కల్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో ఆదివారం రోజు మంజీరా వాగులో నుండి ప్రకాష్, శేషారావు అనే వ్యక్తులు తమ టాటా ట్రక్ వాహనాలలో ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా.. పక్కా సమాచారం మేరకు పట్టుకొని వాహనాలను అదుపులోకి తీసుకున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. వాహనాలకు పంచనామా నిర్వహించి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india